ట్రంప్ టారిఫ్‌లు .. వచ్చే నెల అమెరికాకు మోదీ!

ట్రంప్ టారిఫ్‌లు .. వచ్చే నెల అమెరికాకు మోదీ!

ఢిల్లీ ఆగస్టు 13 (గోల్కొండ ):భారత దేశంపై అమెరికా టారిఫ్‌ల భారం వేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోదీ అమెరికాకు వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం.అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో అమెరికా- భారత్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కు బ్రేక్ పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలు ట్రంప్‌కు నచ్చనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ పై అమెరికా టారిఫ్ లను విధించింది. ఒకసారి కాదు రెండు సార్లు పెంచారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. తొలుత 25 శాతం టారిఫ్ విధించిన ఆయన.. ఇటీవల రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం మేర భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లను విధించారు. అయితే.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోందని.. ఈ కారణంతోనే భారత్ పై అమెరికా సుంకాలు విధించిందని ఆయన మీడియా ప్రకటన చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!