
హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ గొల్లస్ ఇన్ తెలంగాణ” పరిశోధన గ్రంధం ఆవిష్కరణ
వరంగల్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):హన్మకొండ పట్టణంలోని కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర డిపార్ట్మెంట్ ప్రొ. తాళ్ళపల్లి మనోహర్ పర్యవేక్షణలో పరిశోధన చేసిన పరిశోధక విద్యార్థి డాక్టర్ పోతరవేణి తిరుపతి రచించిన “హిస్టరీ అండ్ కల్చర్ అఫ్ గొల్లస్ ఇన్ తెలంగాణ” అనే పరిశోధక గ్రంథంను వైస్ ఛాన్స్ లర్ ప్రొ. కె. ప్రతాప్ రెడ్డి గారి చేతుల మీదుగా బుధవారం రోజున తన చాంబర్ లో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొ. వి. రామచందర్ రిజిస్టర్, ప్రొ. బానోత్ సురేష్ లాల్, డీన్ సోషల్ సైన్స్, ప్రొ. తాళ్ళపల్లి మనోహర్, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కళాశాల తదితరులు పాల్గొన్నారు.


