
పేదలకు అండగా తపాలా ప్రమాద బీమా… బాధితులకు పది లక్షల చెక్కు అందజేత
కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన తాండ్ర శ్రీహస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా చల్లూరు పోస్ట్ ఆఫీస్ లో BAJAJ GAG ప్రమాద భీమా తీసుకోవడం తో బీమా కింద అతని కుటుంబానికి 10 లక్షలు మంజూరు కాగా దీనికి సంబంధించిన చెక్కులను బుధవారం మృతుల కుటుంబ సభ్యులకు తపాలా శాఖ సిబ్బంది చల్లూరు గ్రామంలో అందించారు. ఈనెల 31 తేదీన ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రతి పోస్ట్ ఆఫీస్ లో బీమా చూసుకోవచ్చని జమ్మికుంట పోస్టల్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.ఈ సందర్భంగా పెద్దపల్లి పోస్టల్ బ్యాంక్ మేనేజర్ తొర్తి రాజేష్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని అర్హత కలిగిన 18 నుండి 65 సంవత్సరాల మధ్యఉన్న ప్రతి ఒక్కరూ బీమా చేసుకోవాలని మరణించిన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని సూచించారు.ఈ కార్యక్రమంలోగ్రామ మాజీ సర్పంచ్ లు పొదిల జ్యోతి రమేష్ ,మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకర్ ,బీపీయం నికిత, పోస్టల్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


