మెరుగైన రవాణా సదుపాయాలతోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే   విజయరమణ రావు

మెరుగైన రవాణా సదుపాయాలతోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి ఆగస్టు 11 (గోల్కొండ ప్రతినిధి ):
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలోని రాజీవ్ నగర్ నుండి కాల్వ శ్రీరాంపూర్ రహదారి వరకు రూ.1 కోటి 50 లక్షల సీఆర్ఆర్ గ్రాంట్ నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ మెరుగైన రవాణా సదుపాయాలు ఉంటేనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కదంబాపూర్ గ్రామంలోని రాజీవ్ నగర్ నుండి కాల్వ శ్రీరాంపూర్ ఆర్అండ్ బీ రహదారి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లను అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతున్నట్టు తెలిపారు . నెలరోజుల్లోగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, కదంబాపూర్ లోని వివేకానంద విగ్రహం నుండి కనుకుల చౌరస్తా వరకు బిటి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ రోడ్డు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలక సతీష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు డి. దామోదర్ రావు, పన్నాల రాములు, మాజీ సర్పంచ్ కోడెం అజయ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!