
రాఖీ మానవ సంబంధాలను ఏకం చేసే గొప్ప పండుగ మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్
సిద్దిపేట,ఆగస్టు 09 (గోల్కొండ ప్రతినిధి ) :సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈ రాఖీ పండుగ అని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో శనివారం మాజీ ఎమ్మెల్సీ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఆడపడుచులు ఫరూక్ హుస్సేన్ కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదరుడు, సోదరి మధ్యలో ఉన్న ప్రేమ, బాధ్యత అనుబంధాన్ని సూచించే గొప్ప పండుగే రాఖీ అని అన్నారు. తెలంగాణలో కుల మతాలకు అతీతంగా సోదర భావంతో జరుపుకునే పండుగల్లో ఇదొక గొప్ప పండుగ అని అన్నారు. ఈ పండుగ ద్వారా మానవ సంబంధాల గొప్పతనం గుర్తు వస్తుందన్నారు. బంధాలను అతికించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని, దేవుడి దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు సత్తవ్వ, సంతోష, వెంకటవ్వ, మానస, శ్యామల, అక్షయా, లచ్చవ్వ, వినోదా, నరసవ్వ, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.


