
ఇందిరమ్మ దీవెనలు ప్రజా ఆశీర్వాద బలంతో ముందుకు సాగుదాం….
ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ డివిజన్ పై ప్రత్యేక దృష్టి
అభివృద్ధి సంక్షేమ అందింపులో సేవకులమవుతాం
ఒక ఓటుతో ఇద్దరు సేవకు లా పనిచేస్తాం
42డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చిందం సత్యవతి శ్రీనివాస్…..
మంచిర్యాల టౌన్ ఫిబ్రవరి 5 (గోల్కొండ ) : మంచిర్యాల మున్సిపాలిటీ 42వ డివిజన్ పై ఇందిరమ్మ దీవెనలు తోప్రజా ఆశీర్వాద బలంతో ముందుకు సాగుతూ ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ డివిజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి
అభివృద్ధి సంక్షేమ అందింపులో సేవకులమవుతా మనీ,
ఒక ఓటుతో ఇద్దరు సేవకు లా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని
42 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చిందం సత్యవతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 20 ఏళ్లలో కానీ అభివృద్ధి రెండేళ్లలో ఎమ్మెల్యే దూర దృష్టితో చేశారని 80 కోట్లతో మార్కెట్ రోడ్లో అండర్ డ్రైనేజీ సిస్టం విద్యుత్ ఆధునీకరణతో పాటు 350 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి శిశు సంక్షేమ ఆస్పత్రి మార్పు 250 కోట్లతో రాళ్లవాగు కరకట్ట సుందరంగా గోదావరి స్మశాన వాటిక నిర్మాణాలు తమ గెలుపుకు నాంది పలకనున్నాయన్నారు. ఇదే అభివృద్ధిని 42 డివిజన్లో సైతం కొనసాగిస్తామని ప్రజల ఆదరణ పొందేందుకు ఒక ఓటు ఇద్దరు సేవకులుగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం రేషన్ కార్డులు డ్రైనేజీల ఏర్పాటు రోడ్ల మరమ్మత్తులు ప తొలగింపు పారిశుద్ధ్య పనులు చేసి ప్రజల సేవకులుగా ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు చేతకు చేర్చే కర్తవ్యాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామన్నారు ప్రజల ఆశీర్వాదం హస్తం పార్టీకి నిండుగా ఉందన్న చిందం సత్యవతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ 42 డివిజన్లో పర్యటించి ఇంటింటి ప్రచారాలు ముమ్మురంగా చేశారు. కాంగ్రెస్ గెలుపుతో అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిందం సత్యవతి శ్రీనివాస్ లతోపాటు విజయ్, చిందం శంకర్, పాప రావు, ప్రభ, ద్యావనపల్లి తిరుపతి, సుభాష్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


