దశాబ్ద కాలంగా పార్టీకి చేసిన సేవలను గుర్తించండి

దశాబ్ద కాలంగా పార్టీకి చేసిన సేవలను గుర్తించండి

– డిసిసి అధ్యక్షునిగా అవకాశం కల్పించండి
– కాంపెల్లి సమ్మయ్య
– ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ సారద్యంలో ఢిల్లీకి ప్రతిపాదన
– మద్దతు తెలిపిన యూనియన్ నాయకులు

మంచిర్యాల, గోల్కొండ (అక్టోబర్ 27): దశాబ్ద కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తనను గుర్తించి మంచిర్యాల డిసిసి అధ్యక్ష పదవికి తన పేరును పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాంపెల్లి సమ్మయ్య కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక ప్రసాద్ సారధ్యంలో ఢిల్లీకి వెళ్లి తన పేరును పరిగణలోకి తీసుకోవాలని విన్నవించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ కనీస వేతనాల బోర్డ్ చైర్మన్ బి జనక్ ప్రసాద్ సారథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒ హోటల్లో నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మాన పత్రాన్ని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే ను కలిసి అందజేశారు. అధిష్టానం సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సింగరేణి కార్మికుల పక్షాన గళాన్ని వినిపించిన నేపథ్యం తనదని డిసిసి అధ్యక్ష పదవికి సమ్మయ్య అర్హుడని సింగరేణి కార్మికులు అనుకుంటున్నారని తెలిపారు. మాదిగ సామర్ధ్యానికి చెందిన కాంపల్లి సమ్మయ్యకు డిసిసి అధ్యక్ష పీఠం కట్టబెడితే సింగరేణి ప్రాంతం తో పాటు జిల్లా లోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!