
తపోవన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు….
దేవరకద్ర, సెప్టెంబర్ 21 (గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలో ఉన్న తపోవన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది పాఠశాలలో బతుకమ్మ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ బతుకమ్మ సంబరాలను పాఠశాలలో సాంప్రదాయ రీతిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలతో అట్టసహంగా సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ వర్కుటి నిరంజన్ రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేకగా నిలుస్తుంద న్నారు తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు వైభవంగా జరుపుకునే ఒక గొప్ప వేడుక బతుకమ్మ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వర్కుటి నిరంజన్ రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు చంద్రయ్య, నరసింహులు, రవి, శ్రీనివాసులు, ఇగ్బాల్ పాష, తిరుపతయ్య, కురుమూర్తి, నాగరాజు, అనురాధ ఉమా సబిహా పావని, అనిత, భవాని, స్వప్న, శిరీష, కరిష్మ, మౌనిక, లత, గౌతమి తదితరులు పాల్గొన్నారు.


