
బి ఆర్ ఎస్ పాపాలను కాంగ్రెస్ కడుగుతుంది
– బి ఆర్ ఎస్ పాపాలను కాంగ్రెస్ కడుగుతుంది
– కాలేశ్వరం చెన్నూర్ రైతుల పాలిట శాపంగా మారింది
– బ్యాక్ వాటర్ , వర్షముంపు 20 వేల ఎకరాలుగా గుర్తింపు
– పరిహార అందింపుకు ప్రభుత్వం నివేదికలు తయారు చేస్తుంది
– సరిపడే యూరియా అందుబాటులోకి తెస్తాం
– హస్తం పార్టీ ప్రజలందరికీ భరోసాని ఇస్తుంది
– రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్
మంచిర్యాల: బి ఆర్ ఎస్ పాపాలను కాంగ్రెస్ కడుగుతుంది రాష్ట్రంలో ఆ పార్టీ చేసిన విధ్వంసమే కాకుండా చెన్నూరు నియోజక వర్గానికి ఎనలేని నష్టాన్ని తెచ్చిపెట్టారని, కాలేశ్వరం చెన్నూర్ రైతుల పాలిట శాపంగా మారిందని, బ్యాక్ వాటర్ ,వర్షముంపు 20 వేల ఎకరాలుగా గుర్తించామని పరిహార అందింపుకు ప్రభుత్వం నివేదికలు తయారు చేస్తుందని, త్వరలోనే నష్టపోయిన రైతులకు అందేలా చూస్తామని, హస్తం పార్టీ ప్రజలందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో భరోసా నిస్తుందని , మంచిర్యాలలో గోల్కొండ తోరాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం చెన్నూర్, అన్నారం, కోటపల్లి పర్యటన అనంతరం మంచిర్యాల తన నివాసంలో భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం యూరియా కష్టాలు కొంతమేర ఉన్నాయని దాన్ని పరిష్కరింపు కోసం కేంద్రంతో మాట్లాడి సరిపడే యూరియా అందుబాటులోకి తెస్తామన్నారు. 10 లారీల లోడ్లు దిగుమతికి కార్యచరణ తీసుకున్నట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి అందుబాటులోకి తెస్తామన్నారు. కేంద్రం సరిపడా యూరియాను సప్లై చేయకపోవడం ప్రస్తుతం రైతుల ఎదుర్కొంటున్న సమస్య అన్నారు. గతంలో రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ నష్టాల్లో ఉంటే తాను ఎంపీగా, ప్రధాని మన్మోహన్ తో మాట్లాడి 10వేల కోట్ల సబ్సిడీ ఇప్పిచ్చామన్నారు. డిమాండ్ కు సరిపడా యూరియా రామగుండం తయారీ కాకపోవడంతో రైతులకి కష్టాలొస్తున్నాయన్నారు. కంపెనీలో తయారీ బ్లాకులను పెంచకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడంలో పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. నిజమైన ఆరోలకే పథకాల అందేలా చూస్తున్నామన్నారు. హస్తం పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అందరూ స్వేచ్ఛగా మాట్లాడడమే కాక ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం కావడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. అనంతరం రామకృష్ణాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేసి, తదుపరి ఇందారం వినాయక మండపం వద్ద ఎండి ఫయాజ్ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం చేపట్టి గోదావరిఖని వెళ్లనున్నట్లు మంత్రి చెప్పారు.


