ఇఎస్ఐ,పీఎఫ్ డబ్బులు వెంటనే తమ ఖాతాల్లో జామచేయాలి

ఇఎస్ఐ,పీఎఫ్ డబ్బులు వెంటనే తమ ఖాతాల్లో జామచేయాలి

టీఎంసీసీ సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ

మంచిర్యాల: నస్పుర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్య కార్మికులుగా పనిచేస్తున్న 132 మంది కార్మికులకు 2020వ సంవత్సరంనుండి పీ.ఎఫ్, ఈఎస్ఐ తమ జీతంలోంచి కట్ చేయడం జరిగిందని, జీతంలో జమా చేయడంలేదని, అసొమ్మును వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని మంచిర్యాల మున్సిపల్ కమినర్ కు తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధాముల్లా హరికృష్ణ సోమవారం వినతి పత్రం అందజేశారు. గతంలో చైర్మన్, కమిషనర్లకు విన్నవించడం జరిగిందని అయిన ఎటువంటి సమాచారం తమకు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఎలాగైనా తమ సమస్యలు వెంటనే పరిష్కరించి డబ్బులు తేమాయలు చూడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో
వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, నస్పూర్ యూనియన్ అధ్యక్షులు కొయ్యల వెంకటి కార్మికులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!