
వీధి నిర్వహణలో మసూద్ అలీ పారదర్శకత ను చాటారు
కాంగ్రెస్ టీపీసీసీ సభ్యులు కొండా చంద్రశేఖర్
మంచిర్యాల,గోల్కొండ, ఆగస్టు 31 : విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం మసూద్ అలీ సొంతమని, బల్దియాలో ఆయన సేవలు అభినందనీయమని కాంగ్రెస్ టీపీసీసీ సభ్యులు కొండా చంద్రశేఖర్ అన్నారు.ఐ లైఫ్ కన్వెన్షన్ హాల్లో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. పాల్గొన్న
ప్రజా ప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు పూదరి ప్రభాకర్, మాదేo శెట్టి సత్యనారాయణ రిటైర్డ్ ఎం ఈ
మసూద్ అలీ సేవలను కొనియాడారు. మంచిర్యాలతో 20 సంవత్సరాల అనుబంధం ఉన్న ఆలీ విధి నిర్వహణలో చిత్తశుద్ధిని చాటారని అభినందనలతో ముంచేత్తారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ రాజ మనోహర్, మేనేజర్ సొల్లురి కరుణాకర్, వాటర్ ఏ ఈ రాజేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం,అధికారులు మురళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


