స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీజేపి సత్తా చాటాలే …రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  నాగేశ్వర్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి సత్తా చాటాలే …రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి

వీణవంక, ఆగస్టు 29 (గోల్కొండ):స్థానిక సంస్థ ఎన్నికలలో లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి అన్నారు .భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వీణవంక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో బూతు అధ్యక్షులు కార్యదర్శులు సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథి గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… స్థానిక సంస్థ ఎన్నికలలో లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలిచి మండలంలో జెడ్పిటిసి ఎంపీపీ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 3న రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు రాష్ట్ర అధ్యక్షులు హోదాలో మొదటి సారి కరీంనగర్ పర్యటన ఉన్న సందర్భంగా బూతు అధ్యక్షులు కార్యదర్శులు ఆ సమావేశానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహరాజు, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ పుప్పాల రఘు,మాజీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సమ్మిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మెన్ పెద్ది మల్లారెడ్డి, మాజీ జెడ్పిటీసి దాసారపు ప్రభాకర్,మండల ఉపాధ్యక్షులు ముత్యాల రవీందర్, మేకల సమ్మి రెడ్డి, అమృత ప్రభాకర్,సిలివేరు రాజు, వరుకొలు రాజు, బూతు అధ్యక్షులు మోటం శ్రీనివాస్ ,సంతోష్, అశోక్, నాని నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!