సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఇంటర్నెట్ డెస్క్ (గోల్కొండ ): ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు న్యూ చంఢీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడంతో తీవ్ర నిరాశలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవగా, ఒకటి రద్దు కావడంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆడిన మూడింట్లో రెండు ఓడి.. హైదరాబాద్ జట్టు ఆరో స్థానంలో ఉంది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో అయినా ఫామ్ అందుకుంటాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే..

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ఫ్రఫుల్, కమిందు మెండిస్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు ఇదే..ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, బార్ట్‌లెట్, విజయకుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్, యశ్ ఠాకూర్, హర్పీత్ బ్రార్

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!