రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలుగా బీడీ కార్మికురాలు కూతురు

రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలుగా బీడీ కార్మికురాలు కూతురు

కరీంనగర్ సెప్టెంబరు 04 (గోల్కొండ ):
తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా బీడీ కార్మికురాలు కూతురును తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసినది.
శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం అధిపతిగా మరియు విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కోడూరి శ్రీవాణి 2025 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసినది. సెప్టెంబర్ 5, 2025న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరించనున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలిగేడు గ్రామంలో జన్మించిన శ్రీవాణిది నిరుపేద చేనేత కుటుంబం తల్లి బీడీ కార్మికురాలు శ్రీ వాణి చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ బీడీలు చుట్టుతు తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ఆమె చదువు అంత ప్రభుత్వ విద్యా సంస్థలోనే కొనసాగింది. ఆమె విద్య ప్రయాణమంతా ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ,కరీంనగర్లో ఇంటర్మీడియట్( హెచ్ ఈ సి) కళాశాలలో అన్ని గ్రూపులతో కలిసి మొదటి ర్యాంకు సాధించినారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బి.ఏ లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు సాధించారు. ఎం ఏ ఎకనామిక్స్ లో మొదటి ర్యాంకుతో మూడు బంగారు పథకాలను స్వీకరించినది. కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బీ.ఈడీ ఎం.ఈడి లో ప్రధమ ర్యాంకు సాధించారు. శ్రీవాణి విద్యా అర్హతలు ఎం. ఏ అర్థశాస్త్రం, బీఈడీ, ఏం ఈ డి, ఎం.ఫీల్ అర్థశాస్త్రం, పీహెచ్డీ అర్థశాస్త్రం, అర్థశాస్త్రంలొ నెట్ మరియు సెట్, ఎడ్యుకేషన్లో నెట్ పూర్తి చేశారు. ఒకే సంవత్సరంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (గెజిటెడ్ హోదా) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ASO), డిగ్రీ కాలేజీ లెక్చరర్ (DL),అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం ,అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ శాతవాహన విశ్వవిద్యాలయం మొదలగు ఏకకాలంలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనది. సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గా ప్రభుత్వ బాలికల పాఠశాల మహాదేవపూర్ లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలుగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాచర్ల, గుంటూరు జిల్లాలో, అర్థశాస్త్ర విభాగంలో సహాయాచార్యులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొంతకాలం సమర్థవంతంగా విధులు నిర్వహించినారు. ప్రస్తుతం శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం లో సీనియర్ సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయంలో ఒకపక్క విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే పరిశోధనా రంగంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారు.శాతవాహన విశ్వవిద్యాలయం బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ గా, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి యూజీ విభాగం, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ గా ,అదనపు పరీక్షల నియంత్రణ అధికారి కాన్ఫిడెన్షియల్ విభాగం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తన పరిశోధన మార్గదర్శకత్వంలో ఇద్దరు పరిశోధకులు పిహెచ్డిని పూర్తి చేశారు. ఉన్నత విద్యా విభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.శ్రీవాణి ఎంపికపట్ల పలువురు అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!