మీ కపట నాటకాలు ఆపండి..బిఆర్ఎస్   నేతలపై మంత్రి తుమ్మల ధ్వజం

మీ కపట నాటకాలు ఆపండి..బిఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ధ్వజం

హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ):తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేస్తున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖండించారు. ఇదంతా కపట నాటకమని మండిపడ్డారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం కారణమా? లేక కేంద్ర ప్రభుత్వమా.. కారణమేదో మీకు తెలియదా? యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా? అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు. జియో పాలిటిక్స్ వల్ల దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు అంటూ మండిపడ్డారు. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకని ఫైర్ అయ్యారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!