మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రభుత్వ విఫ్

మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రభుత్వ విఫ్

దామోదర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం.
– హుజూరాబాద్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి విగ్రహన్ని ఏర్పాటు చేస్తాం.
– అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు.
– హుజూరాబాద్, కమలాపూర్ నుండి భారీగా తరలివచ్చిన అభిమానులు.
– జోహార్ దామన్న నినాదాలతో మారుమ్రోగిన సభా ప్రాంగణం.

కరీంనగర్ ఏప్రిల్ 09 (గోల్కొండ ):రాజకీయాల్లో ప్రజల అవసరాల కోసం పనిచేసి కరీంనగర్ జిల్లా టైగర్ గా,నమ్మకానికి,విశ్వసనీయతకు మారు పేరు తెచ్చుకున్న మహా నాయకుడు ముద్దసాని దామోదర్ రెడ్డి అని పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయరమణ రావు ,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం రోజున కరీంనగర్ పట్టణ శివారులోని సదాశివపల్లిలో ఆయన 14వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అతిధులు మాట్లాడుతూ ముద్దసాని దామోదర్ రెడ్డి గురించి జిల్లాలో తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదని, వారి నుండి మాలాంటి యువతర నాయకులం నేర్చుకోవాల్సింది చాలా ఉందని,వారి ఆశయాలకు అణుగుణంగా ప్రజా జీవితంలో పనిచేస్తామని,హుజూరాబాద్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రణవ్ తెలిపారు.విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో పెద్దపల్లి శాసన సభ్యుడు విజయ రమణారావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో దామోదర్ రెడ్డికి అభిమానులు ఉండేవారని,వారి తర్వాత ఆ ప్రాంతానికి నాయకత్వం వహించే నాయకుడిగా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ,కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్,కరీంనగర్ మేయర్ శ్రీనివాస్,సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేష్,దామోదర్ రెడ్డి అభిమానులు భారీగా పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!