మన్యంకొండలో వైభవంగా వెంకటేశ్వర స్వామి తిరుచ్చి సేవ

మన్యంకొండలో వైభవంగా వెంకటేశ్వర స్వామి తిరుచ్చి సేవ

దేవరకద్ర, సెప్టెంబర్ 20 (గోల్కొండ)

మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన దేవాలయమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి వారి తిరుచ్చి సేవా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ పవిత్ర పూజా కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భగుడి నుండి శోభాయమానంగా అలంకరించిన తిరుచ్చి వాహనంపై స్వామివారిని ఊరేగింపుగా దేవస్థానం ముందున్న రథ మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు, కాగడాల వెలుతురు, భక్తుల హరిణామశ్చరణల మద్య స్వామి వారి ఊరేగింపు ముందు కదిలింది. ఈ సందర్భంగా మండపంలో దేవస్థానం చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణల ఆధ్వర్యంలో స్వామివారికి పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని మళ్లీ తిరుచ్చి వాహనంపై రథమండపం నుండి గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు అలంకరణలో తిరుచ్చి వాహనంపై దేవస్థానం పురవీధుల గుండా ఊరేగుతూ భక్తకోటికి దర్శనం ఇచ్చారు. అలంకరణలో స్వామివారిని చూసి భక్తులు తన్మయం చెందారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ,
ఈఓ శ్రీనివాసరాజు, ప్రధాన పూజారులు రాజేష్, నరసింహయ్య, పాలక మండలి సభ్యులు, పర్యవేక్షకుడు నిత్యానంద చారి, దేవస్థానం సిబ్బంది, పురోహితులు, వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!