మంత్రి పొన్నం కు రాఖీ కట్టిన సీతక్క

మంత్రి పొన్నం కు రాఖీ కట్టిన సీతక్క

హైదరాబాద్ ఆగస్టు 09 (గోల్కొండ )
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగ సందర్భంగా, మంత్రి సీతక్క మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాఖీ కట్టి దీవించారు.ఆప్యాయతకు గుర్తుగా, సీతక్కకు పొన్నం ప్రభాకర్ పట్టు బట్టలు సమర్పించి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు .రాష్ట్ర ప్రజలకు సోదరీమణులకు మంత్రి పొన్నం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు .అక్క,తమ్ముడు అన్నా చెల్లెళ్ళ మధ్య అపారమైన ప్రేమను సూచించే ఈ రాఖీ పండుగ సౌభ్రాతృత్వం వెల్లివిరిసేల ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి ఈ రాఖీ పండగ ప్రతి మహిళా జీవితంలో ఆనందం నింపాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాట్టు ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు,ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు,స్వయం సహాయక సంఘాలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సహాల మధ్య మీరు పండగ జరుపుకోవాలని కోరారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించరు మహిళలు మంత్రి పొన్నంకు
రాఖీలు కట్టి స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు ,కార్యకర్తలు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ,మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
పర్యావరణమైన ఎకో రాఖీలు కట్టి పర్యావరణ రక్షించడానికి మహిళలు అవగహన కల్పించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!