
ప్రజల ఆశీర్వాదం కోసం మళ్ళీ వస్తా….ఎంపీ ఈటల రాజేందర్
బాలవికాస స్వచ్చంద అనాధ పుట్టినరోజు వేడులలో
కరీంనగర్ సెప్టెంబర్ 23(గోల్కొండ):
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బాలవికాస స్వచంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అనాథ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ..పేదవారికి అండగా ఉండాలని బాలవికాస కృషి చేస్తుందన్నారు.
ప్రకృతి ని పూజంచే పండుగ బతుకమ్మ,
నిన్ననే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం అయ్యిందని
అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.మనం ఎక్కువ పూజించుకొనేది అమ్మవార్లనే. మన దేశ సంప్రదాయంలోనే మహిళలను పూజించుకునే గొప్పతనం ఉంది.
అన్ని పండుగల్లో కొలిచేది మహిళలనే. ఇప్పుడు మహిళల పండుగ జరుగుతోందన్నారు.స్త్రీలు పట్టించుకున్న ఇల్లు మాత్రమే గొప్పగా ఉంటుంది. భర్త చనిపోతే పిల్లలను సర్వస్వంగా భావించి ఆడవారు పెళ్లి చేసుకోకుండా ఉంటారు తప్ప మగవారు ఉండలేరు. స్త్రీకి తొక్కుడు బండకు ఉన్నంత ఓపిక ఉంటుంది అంటారు.
ధర్మం న్యాయం శాశ్వతం
మంచి చెడు తర్కించే సత్తా ప్రజలకు ఉంది అని నమ్మే వాడిని నేను.. నిరంతరం ప్రజలమధ్యే ఉంటున్న. ఎక్కడ ఉన్నా నా యావ ద్యాస ఏంటో మీ అందరికీ తెలుసు.ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో.. నేను హుజూరాబాద్ కి వస్తే అలా ఉంటుందన్నారు.
హుజూరాబాద్ లోని ప్రజల ఆశీర్వాదం కోసం ప్రతి గ్రామానికి వస్తానన్నారు..హైడ్రా ఇళ్లు కూలగొడితే వారి బాధకు, కార్చిన కన్నీళ్లకు పరిష్కారం చూపాలని మీరు ఇచ్చిన స్ఫూర్తితో కోట్లాడుతున్నా అన్నారు.బాలవికాస ఎలా పేదలకోసం పని చేస్తుందో..
నేను కూడా ఉన్నంత కాలం పేదల కోసం పనిచేస్తా అని ఈటల తెలిపారు.


