
నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు….
సైమా’ బృందం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనన్నారని అన్నారు. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై అయన మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులొచ్చాయి. ‘సైమా’ స్పందించి, జాతీయ అవార్డు విజేతలను సత్కరించడం అభినందనీయం. తెలుగు సినిమాకు ఇన్ని అవార్డులు వచ్చినా మన పరిశ్రమ స్పందించలేదు. జాతీయ అవార్డులను ఒక పండుగగా నిర్వహించుకోవాలి. ఇక్కడ అలా జరగడం లేదు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం’ అని అన్నారు.
TAGS Hot News


