
టిపిసిసి అధ్యక్షుడ్ని కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్
దేవరకద్ర, సెప్టెంబర్ 16 (గోల్కొండ)
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో దేవరకద్ర ఎమ్మెల్యే కలసి శుభాకాంక్షలు తెలిపారు.
TAGS Hot News


