జేఎన్టీయూ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల విద్యార్థిని అస్మితకు స్వర్ణ పతకం

జేఎన్టీయూ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల విద్యార్థిని అస్మితకు స్వర్ణ పతకం

మంచిర్యాల టౌన్ (గోల్కొండ న్యూస్)ఫిబ్రవరి 28:
హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం లో 27వ తేదీ న నిర్వహించిన జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్ టైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన విశ్వనాథ్ అస్మిత అండర్–62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.
అస్మిత ప్రస్తుతం వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్ లో బీటెక్ ప్రథమ సంవత్సరం సిఎస్ఈ విభాగంలో చదువుతోంది. కళాశాల తరఫున యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె ప్రతిభతో బంగారు పతకం దక్కించుకుంది.ఈ సందర్భంగా శిక్షకులు మంద శ్రీనివాస్ ఆమెను అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షులు జి. వెంకటస్వామి, కార్యదర్శి బుచ్చి రామారావు అస్మిత విజయాన్ని కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అస్మిత తల్లి దండ్రులు విశ్వనాథ్ జయంతి, రాము తమ కుమార్తె విజయంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ విజయంతో మంచిర్యాల జిల్లా క్రీడా రంగంలో మరో ఘనత నమోదు చేసుకుంది అని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!