
ఘనంగా సద్దుల బతుకమ్మవేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే పాడి-ఎమ్మెల్సీ వెంకట్
వీణవంక, సెప్టెంబర్ 29(గోల్కొండ)
మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.
తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మ లను మహిళలు పేర్చుకొని తీసుకోని వచ్చి బతుకమ్మ ఘాట్ ల వద్దకు తీసుకొచ్చి సద్దుల బతుకమ్మ వేడుకలను సాంప్రదాయ పద్దతిలో
కోలాట ఆట పాటల తో ఘనంగా నిర్వహించుకున్నారు.అనంతరం వాగుల వద్ద, చెరువు కట్టల వద్ద నిమజ్జనం చేశారు.ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ లు పాల్గొన్నారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ బల్మూర్
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నర్సింగాపూర్ లోని హరిహర క్షేత్రం వద్ద ప్రతిష్టించిన దుర్గ మాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.మండల ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి, చింతల శ్యామ్ సుందర్ రెడ్డి, కొమ్మిడి రాకేష్ రెడ్డి, యూత్ నాయకుడు శీలం సురేందర్ రెడ్డి,అనిల్ రెడ్డి, తో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.


