
ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. స్పందించిన దానం నాగేందర్
హైదరాబాద్ అక్టోబరు 05 (గోల్కొండ ): దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద వార్తలు వచ్చాయి.
ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దానం నాగేందర్ ఖండించారు. రాజీనామా ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. తానంటే గిట్టనివాళ్లు తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అని ఆయన వెల్లడించారు.
TAGS Hot News


