
ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కౌశిక్ రెడ్డి,వెంటనే భర్తరఫ్ చేయాలి..ఇంచార్జి వొడితల ప్రణవ్
డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం..
పొలిటికల్ డైవర్షన్ కోసం కౌశిక్ రెడ్డి కొత్త నాటకం.
హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకం,ఇప్పటికే మున్సిపల్ లో వ్యక్తిరేకంగా తీర్మానం చేశాం..
సోషల్ మీడియాలో రీల్స్,లైకులు తప్ప,ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదు.
– ప్రజలను హిసించడం మానేసి,ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్న..ఇంచార్జి వొడితల ప్రణవ్
కరీంనగర్ ఏప్రిల్ 02 (గోల్కొండ ):సి ఐ డీ కేసులు అసెంబ్లీ లో చేసిన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ
అసెంబ్లీ సాక్షిగా సీనియర్ శాసన సభ్యుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మేల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి వివక్ష చూపించడం దారుణమని,సీనియర్ దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుని పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనీ,వెంటనే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా కౌశిక్ రెడ్డి అరాచకాలు ఎక్కువ అయ్యాయని తన ప్రవర్తన రాష్ట్రం మొత్తం చూసిందని,ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని,కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరారు.గతంలో గవర్నర్ ను,కులాలను,మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడడం,జర్నలిస్టులను,వ్యాపారస్తులను బెదిరించడం,కొట్టడం,రైతులను తిట్టడంలాంటి వల్ల నియోజవర్గంలోని ప్రజలు ఇంకెంత కాలం భరించాలి అని తలలు పట్టుకుంటున్నారని,ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి ఎమ్మేల్యే మాకు అవసరమా అని అనుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కంపెనీలపై సీబీ,సీఐడి విచారణ వేశామంటేనే మా పార్టీ ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు.
డంపింగ్ యార్డు వేరే చోట మార్చడానికి కట్టుబడి ఉన్నాం..
డంప్ యార్డ్ పై ఇప్పటికే అధికారులకు పూర్తి సమాచారం అందించామని,డంపింగ్ యార్డ్ సమస్యపై త్వరలో అఖిలపక్ష నేతలతో సీఎం రేవంత్ రెడ్డినీ కలుస్తామని ప్రజలకు హాని చేసే ఏ కార్యక్రమం ప్రభుత్వం తీసుకోదని మరోసారి స్పష్టం చేశారు ప్రణవ్.హుజూరాబాద్ నియోజకవర్గ భవిష్యత్ మాకు ముఖ్యమని ఇప్పటికే మంత్రులకు ఈ విషయంపై పలుమార్లు పూర్తి నివేదిక అందజేశామని,దీనిపై రద్దుకు మా వంతు కృషి చేస్తామని అన్నారు.అయితే డంపింగ్ యార్డ్ విషయంలో కావాలని కౌశిక్ రెడ్డి తనపై ఉన్న సీబీ,సిఐడి కేసు నుండి డైవర్షన్ కోసం కొత్త డ్రామా మొదలు పెట్టాడని ఎద్దేవా చేశారు.విచారణ 4తేదీ ఉందని దానికి ముందు బంద్ పిలుపు ఇవ్వడం,విచారణ తర్వాత దీక్షలో కూర్చుంటానని అనడం పట్ల రాజకీయ లబ్ధి స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు.వరంగల్ మీటింగ్ లో చొప్పదండి మీటింగ్ లో సీఎం అనని మాటలను అన్నట్టుగా సోషల్ మీడియాలో కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని అన్నారు.ఎంత సేపు తన స్వంత రాజకీయ లాభం కోసం ఆలోచించడం తప్ప ప్రజల కోసం కౌశిక్ రెడ్డి చేసింది ఏం లేదని అన్నారు.2022లోనే డంప్ యార్డ్ ప్రతిపాదన వచ్చినప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాట్లాడడం,ధర్నా చేస్తా అనడం రాజకీయ కోణం లేదా అని ప్రశ్నించారు.ఎవరెన్ని చెప్పినా డంప్ యార్డ్ వేరే స్థలానికి మార్చడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు.
దళిత వ్యతిరేకి కౌశిక్ రెడ్డి..
దళిత బంధు విషయంలో అప్పుడు ఎమ్మెల్సీ గా,విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎందుకు దళిత బంధు ఇవ్వలేదని,చంపినోడే సంతాప సభ పెట్టినట్టు దళిత బంధు విషయంలో అబద్ధాలు మాట్లాడుతున్నాడని అసలు దళిత బంధు ఆపిందే కౌశిక్ రెడ్డి అని,ఆనాడే అందరికి ఇవ్వగా ఎవరు ఆపారని ప్రశ్నించారు.కేవలం ఓట్ల కోసం వారిని వాడుకున్నారని నిజంగా వారి అభ్యున్నతికి పాటు పడాలనే ఉద్దేశ్యం ఉంటే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడే ఇచ్చే వాడని అన్నారు.మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఇస్తున్నామని ఓట్ల కోసం కాకుండా వారి అభ్యున్నతికి పాటు పడుతున్నామని అన్నారు.
చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం..
రైతుల అవసరాల దృష్ట్యా సాగునీటి విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయమని వారి కోరిక మేరకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా వారు సానుకూలంగా స్పందించారని అన్నారు.రైతులెవరూ అధర్యపడవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులూ ఉన్నారు .


