
ఈడీ విచారణకు హాజరైన సినీనటి మంచు లక్ష్మి
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి )
సినీనటి మంచు లక్ష్మి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నేడు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్‌రాజ్ విచారణకు హాజరయ్యారు.టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా. ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మీని ఈడీ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఐదేళ్ల లావాదేవీలను ఈడీ అధికారులకు లక్ష్మీ అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే మంచు లక్ష్మీ వెళ్లిపోయారు.


