ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్

ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్

భువనేశ్వర్ ఆగస్టు 17 (గోల్కొండ ) : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం అల్టిమేట్ మెడికేర్‌లో చేరారు. డీహైడ్రేషన్‌తో బాధపడుతుండటంతో ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్సకు సహకరిస్తున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.నవీన్ పట్నాయక్ ఆదివారంనాడు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వైద్యుల బృందం ఆయన ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆయనను మెడికేర్‌ ఆసుపత్రిలో చేర్చారు. 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ సర్వికల్ ఆర్థరైటిస్‌కు ఇటీవల ముంబైలో స్పైనల్ సర్జరీ చేయించుకున్నారు. జూలై 12న తిరిగి ఒడిశా చేరుకున్నారు. 21 రోజుల చికిత్స తర్వాత భువనేశ్వర్ చేరుకున్న ఆయనకు ఘనమైన స్వాగతం లభించింది. వందలాది మంది బీజేడీ మద్దతుదారులు జెండాలు ఊపుతూ ‘జై జగన్నాథ్’ అంటూ తమ నేతకు స్వాగతం పలికారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!