ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే….

ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే….

ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే…ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు : తుడి లచ్చన్న

గంగాధర అక్టోబర్ 02 (గోల్కొండ):

గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో గురువారం టీ.ఎల్ యువసేన ఆధ్వర్యంలో ఆడ పిల్ల – బంగారు తల్లి పథకం కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ గ్రామంలో 2023 లో జన్మించిన పలువురు ఆడ పిల్లలకు సామాజిక సేవకుడు తుడి లచ్చన్న తన స్వంత ఖర్చుతో 5016/- రూపాయలతో దసరా కానుకగా సుకన్య సమృద్ధి యోజన పథకం లో భాగస్వామ్యులను చేశారు. ఈ కార్యక్రమంలో తుడి లచ్చన్న మాట్లాడుతూ…ఆడ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తే…ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారు అని వారి తల్లితండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు తుడి లచ్చన్న ను పలువురు గ్రామస్థులు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!