
అక్రమ ఇసుక రావాణా పై నిరంతరం నిఘా….
పోతిరెడ్డి పల్లి లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్
వీణవంక, సెప్టెంబర్ 20(గోల్కొండ)
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించామని హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు.ఇల్లీగల్ అక్టివిటీస్ లో భాగంగా మండలం లోని పోతిరెడ్డిపల్లి గ్రామం లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.వాహనాలకు సంబందించిన సరైన నెంబర్ ప్లేట్స్ తో పాటు ధ్రువ పత్రాలు లేని వాటి పై వెరిపి కేషసన్ చేసి చట్ట వ్యతిరేకానికి ఉన్న వాటి పై సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో 22 ట్రాక్టర్ లు, 18 టూ వీలర్స్, 4గూడ్స్ వెహికల్స్ పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ గ్రామం నుండి ట్రాక్టర్ లలో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలించే ట్రాక్టర్ ల ను పట్టుకొని కేసులు నమోదు చేస్తామని,అలాగే ఇసుక తరలించే వాహనాల వెంబడి టూ వీలర్ తో పై లట్ లుగా పోలీసుల సమాచారం తెలుసుకుంటూ అక్రమ ఇసుక కు సహరిస్తున్న వారి పై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని ఏసీపీ మాధవి అన్నారు.సైబర్ నేరాలను అరికట్టెందుకు పోలీసుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులను గ్రామాల్లో,పాఠశాలలో, యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.ఇటీవల డివిజన్ పరిధిలో పలు గంజాయి కేసులు నమోదు చేశామని,గంజాయి సరఫరా చేసే వారి పై తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై ఆవుల తిరుపతి, ఇల్లందకుంట,సైదాపూర్,ఎస్సైల తో పాటు స్పెషల్ పోర్స్ టీం పోలీస్ సిబ్బంది ఉన్నారు.


