
అంగన్వాడీ కేంద్రంలో ఆయా లేక అవస్థలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండలంలోని నంది మేడారం గ్రామంలో 5 అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో తెనుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం-1 లో గత ఐదు సంవత్సరాల నుంచి ఆయా (సహాయకురాలు) పోస్టు ఖాళీగా ఉంది. 2020 లో అప్పటి ఆయా రాజీనామా చేయగా ఇంతవరకు పోస్ట్ భర్తీ కాలేదని అంగన్వాడీ టీచర్ అరుణ తెలిపారు. ఆయా లేకపోవడంతో అన్ని పనులు తానే చూసుకోవాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అధికారులు స్పందించి ఆయా పోస్టును భర్తీ చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
TAGS Hot News


