
రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు
వీణవంక, సెప్టెంబర్ 10(గోల్కొండ):మండలం లోని నర్సింగా పూర్ గ్రామం లో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూల మాళలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి,మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఈ సందర్బంగా తెలిపారు.రజక సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆమె విగ్రహం గ్రామం లో ఏర్పాటు చేయడం కోసం ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం ఆధ్వర్యంలో రాచర్ల కుమార్, రవీందర్ రమేష్, అనిల్, సునీల్, సారయ్య, తిరుపతి, గణేష్, సదానందం తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
TAGS Hot News


