యూరియా కోసం బారులు తీరిన రైతులు…

యూరియా కోసం బారులు తీరిన రైతులు…

ధర్మారం, సెప్టెంబర్ 09 (గోల్కొండ)
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నంది మేడారం గోడౌన్ వద్ద మంగళవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. మండలంలో వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు పుర్తి స్థాయి పంటలు వేయడంతో యూరియా వినియోగం తో మార్కెటులో సరిపడా నిల్వలు అందుబాటులొ లేకపోవటంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.ధర్మారం వ్యవసాయ విస్తీర్ణ అధికారి పర్యవేక్షణలో రైతులకు బస్తాలను పంపిణీ చేశారు.గొడవలు జరగకుండా పోలీసులు పంపిణీ కేంద్రం వద్ద కాపలా ఉన్నారు.రెవె న్యూ గ్రామాల వారీగా యూరియా పంపిణీ చేస్తున్నందున ధర్మారం, బొమ్మరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేశారు. మొత్తం 250 బస్తాలు పంపిణీ చేసినట్లు ఏఈఓ తెలిపారు.ప్రతి రైతుకు సరిపడా యూరియా ప్రభుత్వం అందుబాటులొ ఉంచాలని రైతులు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!