మంచిర్యాల లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మంచిర్యాల లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మంచిర్యాలఆగస్టు 15 ( గోల్కొండ)
మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కష్టసుఖలు తెలుసుకొని, సమస్యలను పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని , సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీసీసీ అధ్యక్షురాలు పేర్కొన్నారు.మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 283 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి విలువైన (10595220 )/- రూపాయల చెక్కులను మరియు మంచిర్యాల, నస్పూర్, దండేపల్లి మండలానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు విలువైన (44,05,104) /-రూపాయల కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు .ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్ ,మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ-ముని , లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ తాజా మాజీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, బీసీ, ఎస్సి, మైనార్టీ, ఎన్ ఎస్ యూ ఐ , అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!