భారీ వర్షాలు…. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి…

భారీ వర్షాలు…. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి…

తెనాలి ఆగస్టు 14 (గోల్కొండ ):
తెనాలి నియోజిక వర్గంలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం అక్కడే అధికారులకి దిశానిర్దేశం చేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని కరకట్ట సమీప లంక గ్రామాలకు చేరుకొని అక్కడ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అత్తోట, ఐతానగర్ సమీప గోలిడొంక ప్రాంతాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!