
నేడు మూసాపేటలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం
దేవరకద్ర, సెప్టెంబర్ 22 (గోల్కొండ):
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మూసాపేట లో మంగళవారం బిజెపి పార్టీ ఇన్చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన కందూర్ రాంరెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో భారతీయ జనతా పార్టీ దేవరకద్ర శాఖ తరపున ఉచిత కంటి పరీక్ష శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సేవా పక్వాడ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జరుగుతున్న ఒక మంచి కార్యక్రమం. మూసాపేట మండలం వేముల గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న రైతు వేదిక పక్కన ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కావున ఈ కార్యక్రమానికి దేవరకద్ర నియోజకవర్గం లోని పార్టీ జిల్లా పదాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్ఛాల అధ్యక్షులు, మండల సేవా పక్వాడ కన్వీనర్లు కన్వీనర్లు, హాజరు కావాలని దేవరకద్ర నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి కోరారు.


