ధర్మారంలో ఘనంగా దసరా వేడుకలు

ధర్మారంలో ఘనంగా దసరా వేడుకలు

ధర్మారం, అక్టోబర్ 2 (గోల్కొండ): ధర్మారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజలు విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి, స్నానం ఆచరించి ఆయా గ్రామాలలోని ఆలయాలలో పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలను అలంకరించి పూజలు చేశారు. ధర్మారం, నంది మేడారం సహా అన్ని గ్రామాలలో శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. ఒకరికొకరు శమీ ఆకు ఇచ్చుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు పండుగ నిర్వహించుకోవాలని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!