జలమయంగా పొత్కపల్లి మహా లింగేశ్వర స్వామి ఆలయం.. భక్తుల ఇబ్బంది

జలమయంగా పొత్కపల్లి మహా లింగేశ్వర స్వామి ఆలయం.. భక్తుల ఇబ్బంది

ఓదెల సెప్టెంబర్ 26 (గోల్కొండ):
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని భవాని సమేత శ్రీ మహాలింగేశ్వర ఆలయం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ పరిసరాలు జలమయంగా మారాయి. దీంతో వరద నీరు భారీగా ఆలయంలోపల చేరుకోవడంతో స్థానిక భక్తులు భవాని దీక్ష పరులు ఇబ్బందులు పడ్డారు. దుర్గామాత కమిటీ సభ్యులు తాత్కాలికంగా కాలువను ఏర్పాటు చేసి బయటకు నీరును తరలించారు. ఆలయ పరిసరాల్లో వరద నీరు లేకుండా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!