గుక్కెడు నీళ్లకు పుట్టెడు కష్టాలు..

గుక్కెడు నీళ్లకు పుట్టెడు కష్టాలు..

చింతకుంట గిరిజన గ్రామ ప్రజల గొంతు తడిపేదెవరు

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 12 (గోల్కొండ )
ఇంత అధునాతన యుగంలోకూడా త్రాగు నీరు కోసం వాగులు వంకల్లోని సెలిమల పై ఆధార పడుతున్నారు అంటే ఆ గ్రామ గిరిజనులు ఎంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతెపట్టి గ్రామ పంచాయతీ లో గల చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సరైన రోడ్డు సదుపాయం లేదు, కనీసం అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. అయినా ఎవరినీ ఆశ్రయించకుండా వారి బాధలు వారు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ వారిది ఒక్కటే తీరని కోరిక అదీ గుక్కెడు మంచినీటి కోసం అనేక కష్టలు పడుతున్నారు. అసలే వర్షాల కాలం అందులో అంతుపట్టని రోగాలు కేవలం కలుషిత త్రాగునీటి ద్వారానే ప్రబలే అవకాశం ఉంది.ఆ ఆదివాసీ గిరిజనులు త్రాగటానికి మంచినీరు కావాలి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. నాయకులు గానీ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడడంలేదని మండిపడుతున్నారు.కలుషిత నీటితో కలరా వంటి అతిసార వ్యాధులు ప్రభలుతున్న ఈ తరుణంలో చంటి పిల్లలతో, వయసు మీద పడ్డ ముసలివాళ్లతో జీవనం గడుతున్నారు. పిల్లకు, పెద్దవాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలా అనేక రకాల సమస్యల వలయంలో కూరుకుపోయింది .స్థానిక శాశన సభ్యుడి కి అనేక మార్లు మోర పెట్టుకున్న పట్టించుకోవడంలేదని జిల్లా కు ముగ్గురు మంత్రులున్న దాహార్తి తీర్చడం లేదని అరోపించారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల స్పందించి చింతకుంటలో పర్యటించి దాహర్తి తీర్చాలని కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!