కోయిల్ సాగర్ ప్రాజెక్టులో నిలకడగా నీటిమట్టం

కోయిల్ సాగర్ ప్రాజెక్టులో నిలకడగా నీటిమట్టం

ఆయకట్టుకు కొనసాగుతున్న నీటి సరఫరా

దేవరకద్ర, సెప్టెంబర్ 10 (గోల్కొండ):

మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రధాన ప్రాజెక్టు అయిన దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ భారీ నీటిపారుదుల ప్రాజెక్టులో బుధవారం నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ స్తోమత 32.5 ఫీట్లు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 31.9 ఫీట్లు నీరు ఉంది. ఇది ఇలా ఉండగా ప్రాజెక్టు నుండి కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీటి సరఫరా కొనసాగుతుంది. దీంతో ఆ ఎక్కడ రైతులు ముమ్మరంగా సేద్యం పనులు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన గుండుమాళ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి నీరు క్రమేపి వచ్చి చేరుతుంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!