
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల హవా
దుబాయ్ భారత స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన వన్డేల్లో నెంబర్‌వన్ బ్యాటర్‌గా నిలిచింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో మంధాన ఓ స్థానం ఎగబాకి టాప్ ర్యాంక్‌కు చేరింది. నాట్ షివర్ బ్రంట్ (ఇంగ్లండ్) రెండో ర్యాంక్‌కు పడిపోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగై 13వ ర్యాంక్‌కు చేరింది. స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్) నెంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతోంది.
TAGS Hot News


