ఆర్థోపెడిక్ పాలి క్లినిక్ ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్
దేవరకద్ర, అక్టోబర్ 2 (గోల్కొండ):
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఆర్థోపెడిక్ పాలిక్ క్లినిక్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ఎస్ ఎల్ ఎన్ కిచెన్ అండ్ రెస్టారెంట్ ను కూడా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని భూత్పూర్ మండలం వెలికిచర్లలో గురువారం హెచ్ పి శ్రీనివాస పెట్రోల్ పంప్ ను కూడా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెట్రోల్ పంప్ నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొత్త మోల్గర గ్రామంలో మణికంఠ హోటల్ ను కూడా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


